

నటుడు సునీల్ థాపా (68) శనివారం ఖాట్మండులో గుండెపోటుతో కన్నుమూశారు. నేపాలీ సినిమా పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన, నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన థాపా 300 కుపైగా నేపాలీ చిత్రాల్లో నటించారు. 1991లో విడుదలైన కల్ట్ క్లాసిక్ చిత్రం చినోలో రటే కైలా పాత్ర ఆయనకు విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ చిత్రం మేరీ కోమ్ (2014)లో ప్రియాంక చోప్రా కోచ్ నర్జిత్ సింగ్ పాత్రలో నటించడం ద్వారా ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సినిమాల్లోకి రాకముందు 1970 ల మధ్యలో ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన థాపా, హిందీతో పాటు ప్రాంతీయ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో డేవిడ్ ఖుజౌ పాత్రలో కనిపించారు. ఆయన రెండుసార్లు మోషన్ పిక్చర్స్ అవార్డ్ నేపాల్ అందుకున్నారు మరియు ఎవరెస్ట్ ఫిల్మ్ అకాడమీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!