

నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకునేలా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్లో చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాలయ్య ఎనర్జిటిక్ స్టెప్స్‌కు నర్గీస్ ఫక్రీ గ్లామర్ జతకానుండటంతో ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించిన నర్గీస్ ఫక్రీకి గ్లామర్ పాత్రల్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆమె బాలయ్య సినిమాలో కనిపించబోతుందన్న వార్తతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!