

అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో నాని మరో అరుదైన ఘనతను అందుకున్నారు. మహేశ్ బాబు, నాని ఇద్దరి ఖాతాలో చెరో 12 సినిమాలు ఉండటంతో ఇద్దరూ అగ్రస్థానంలో నిలిచారు. వీరి తర్వాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ చెరో 9 సినిమాలతో ఉండగా, ప్రభాస్ 8 సినిమాలతో కొనసాగుతున్నారు. అల్లు అర్జున్, ఎన్‌బీకే చెరో 6 సినిమాలతో ఉన్నారు. చిరంజీవి, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ చెరో 5 సినిమాలతో నిలిచారు. వెంకటేష్, వరుణ్ తేజ్ చెరో 4 సినిమాలతో ఉండగా, నవీన్ పొలిశెట్టి, నాగార్జున, అదివి శేష్ 3 సినిమాలతో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, తేజ సజ్జ చెరో 2 సినిమాలతో కొనసాగుతున్నారు.
ఇక నితిన్, శ్రీవిష్ణు, అఖిల్, నిఖిల్, మౌళి, రవితేజ చెరో 1 సినిమాతో ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా మార్కెట్‌లో తెలుగు సినిమాలకు ఉన్న ఆదరణకు ఈ గణాంకాలు మరోసారి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా నాని సినిమాలు విదేశీ ప్రేక్షకుల నుంచి స్థిరమైన స్పందన అందుకుంటున్నాయని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని, ఇప్పుడు 12 సినిమాల మైలురాయితో మహేశ్ బాబుతో కలిసి అగ్రస్థానంలో నిలవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దీంతో అమెరికాలో నాని మార్కెట్‌పై మరోసారి చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!