

తెలుగు సినీ, టెలివిజన్ రంగాల్లో నంది అవార్డులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కళాకారులు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రతిభ ఆధారంగా సత్కరించే ఈ అవార్డుల ప్రదానోత్సవాలు కొంతకాలంగా నిలిచిపోయాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ ద్వారా నంది అవార్డులకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా అందించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. ఫిల్మ్ అవార్డుల వేడుకను విజయవాడలో, టీవీ అవార్డుల వేడుకను తిరుపతిలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవార్డుల ఎంపికకు కమిటీల ఏర్పాటు, తదుపరి ప్రకటనలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!