

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 23 సాయంత్రం లేదా రాత్రి నుంచి షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అయితే ప్రీమియర్ సమయం దగ్గరపడుతున్నప్పటికీ టికెట్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. సినిమా కంటెంట్ ప్రీమియర్ షోలు నిర్వహించే థియేటర్లకు చేరిన తర్వాతే బుకింగ్స్ ఓపెన్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో కొన్ని సినిమాలకు కంటెంట్ ఆలస్యంగా చేరడంతో ప్రీమియర్ షోలు ఆలస్యమైన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగానే సినిమాను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!