

ప్రముఖ ఛాయాగ్రాహకుడు సౌందరరాజన్ ‘నాగబంధం’ చిత్రాన్ని ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించే సినిమాగా అభివర్ణించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రం పురాణాలు, కల్పిత కథనం, భావోద్వేగాలను మేళవించిన విజువల్ వండర్‌గా ఉండబోతోందని తెలిపారు. జులై 3న విడుదల కానున్న ఈ చిత్రంలో తాను స్క్రిప్ట్ దశ నుంచే భాగస్వామిగా ఉన్నానని, దర్శకుడి విజన్ తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు.
ఈ చిత్రం కోసం తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం సహా పలు ఆలయాలను అధ్యయనం చేసి, వాటి స్ఫూర్తితో భారీ సెట్లను నిర్మించినట్లు వెల్లడించారు. దేవాలయ ప్రవేశ ద్వారం నుంచి స్వామివారి విగ్రహం వరకు ఒకే షాట్‌లో చూపించే ప్రత్యేక సన్నివేశం కోసం అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించినట్లు చెప్పారు. హైదరాబాద్, కేరళ, తమిళనాడు, హిమాలయ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రం దృశ్య వైభవంతో పాటు దైవిక అనుభూతిని పంచుతుందని తెలిపారు. నటీనటుల అంకితభావం, సంగీతం, విజువల్స్ కలిసి ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!