
సినిమాలు

అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నబా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జూలై 3న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్, థియేట్రికల్ హక్కుల విక్రయాల్లో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!