
రాజకీయాలు

నటి మౌనీ రాయ్ మరియు ఆమె భర్త సూరజ్ నంబియార్ తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తూ, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ కష్ట సమయంలో తమకు గోప్యత కల్పించాలని, ఎవరి గురించి అయినా అసత్య ప్రచారం చేయవద్దని ప్రజలను, మీడియాను కోరారు.
2022 జనవరిలో వివాహం చేసుకున్న ఈ జంట కొంతకాలంగా విడాకుల వార్తలతో వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. అనంతరం మౌనీరాయ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నాగిని సీరియల్‌తో గుర్తింపు పొందిన మౌనీ, గోల్డ్, బ్రహ్మాస్త్రం: పార్ట్ వన్ – శివ వంటి చిత్రాలతో వెండితెరపైనా ప్రేక్షకులను అలరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!