

క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ తన కెరీర్లో “మిరాకిల్” అత్యంత గుర్తుండిపోయే సినిమా అవుతుందని వెల్లడించారు. కొండమడుగు గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, కుమారి 21ఎఫ్, ఈడో రకం ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్ వంటి విజయవంతమైన చిత్రాలు తన కెరీర్లో ఉన్నప్పటికీ “మిరాకిల్” ప్రత్యేకమైన చిత్రం అవుతుందని అన్నారు. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరోగా నటిస్తుండగా, సీనియర్ నటులు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.
మూడో షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా కొండమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిత్రబృందం, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ, “మిరాకిల్”లాంటి వినూత్న కథాచిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు. దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ ఇప్పటివరకు భారతీయ తెరపై చూడని కొత్త కథా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మూడో షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యిందని, త్వరలో చివరి షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!