
.png&w=3840&q=75)
జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ బ్యానర్లో, "అద్భుతం", "టెనంట్" వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ గారి నిర్మాణంలో, క్రికెట్ నేపథ్యంతో కూడిన కామెడీ డ్రామా G.O.A.T రూపొందుతోంది. సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
ఇటివలే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ "ఒడియమ్మ" పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటను అదిరిపోయే లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సుధీర్ కెరీర్లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదేనని చెప్పవచ్చు. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు హిట్గా గుర్తింపు పొందడంతో, సినిమా పై బజ్ మరింత పెరిగింది.
తాజాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మణిశర్మ టీమ్ చేరడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. మేకర్స్ చిత్రం అత్యంత బాగా వచ్చింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గ్రాండ్గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నటీనటులు: సుడిగాలి సుధీర్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని.
బ్యానర్: జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్
నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్
మ్యూజిక్: లియోన్ జేమ్స్
బీజీఎం: మణిశర్మ
పీఆర్ ఓ: తేజస్వి సజ్జా










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!