

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫన్, చిరంజీవి విన్టేజ్ చార్మ్‌తో రూపొందిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుండగా, నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹190 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. నిన్న దాదాపు అన్ని షోలు హౌస్‌ఫుల్‌గా నడవగా, కనుమ రోజున అన్ని ప్రాంతాల్లో టికెట్లు పూర్తిగా సౌల్డ్ అవుట్ అయ్యాయి.
డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అదనపు షోలు, స్క్రీన్లు పెంచినా కూడా ప్రేక్షకుల రద్దీ తగ్గడం లేదు. కేవలం నాలుగు రోజుల్లోనే బుక్‌మైషోలో 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడై, ఈ ఘనత సాధించిన వేగవంతమైన ప్రాంతీయ చిత్రంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిలిచింది. నాలుగో రోజు కూడా తొలి రోజు స్థాయిలోనే వసూళ్లు నమోదు కావడం విశేషం. గురువారం ఒక్కరోజే 4.24 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడంతో సినిమా ట్రెండ్ మరింత బలపడింది. ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తుంటే, ఈ చిత్రం మరికొన్ని రోజులు ఘనంగా రన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!