
జనరల్

ఎన్బీకే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్బీకే111 చిత్రంలో నటుడు మంచు మనోజ్ చేరినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ అప్డేట్తో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. గతంలో ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ చిత్రంలో కలిసి నటించిన బాలకృష్ణ, మనోజ్ మరోసారి స్క్రీన్‌ను పంచుకోనున్నారు.

ఈ కలయికతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శక్తివంతమైన నటీనటులు, బలమైన కథతో రూపొందుతున్న ఎన్బీకే111 ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. మంచు మనోజ్ ఎంట్రీతో సినిమాకు మరింత బలం చేకూరనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!