

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, ప్రాంతీయ సినీ పరిశ్రమలో ఆల్టైమ్ హిట్గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ సినిమా, నిర్మాతలతో పాటు పంపిణీదారులకు కూడా భారీ లాభాలు తీసుకొచ్చింది.
చిత్రబృందం తాజాగా మరో కీలక మైలురాయిని ప్రకటించింది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వినోదంతో పాటు భావోద్వేగాలు కలగలిపిన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్లో నయనతార కీలక పాత్రలో కనిపించగా, వెంకటేష్ ఎక్స్టెండెడ్ కామియోలో సందడి చేశారు. అలాగే సచిన్ ఖేడేకర్, హర్ష వర్ధన్, జరినా వాహబ్, కేథరిన్ ట్రెసా, అభినవ్ గోమటం, మాస్టర్ రేవంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!