

శివ కంఠంనేని, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమరావతికి ఆహ్వానం. జీవీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో, జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉత్కంఠభరితమైన కథ, బలమైన కథనంతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు జీవీకే తెలిపారు.
ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!