

తండేల్తో భారీ హిట్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇప్పుడు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మీద మొదటి నుంచీ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
చిత్రబృందం తాజాగా ఓ కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ను నవంబర్ 22న రిలీజ్ చేయబోతున్నారు. మరింత స్పెషల్గా, ఈ ఫస్ట్ లుక్ను గ్లోబ్ ట్రాటర్ మహేష్ బాబు స్వయంగా రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ అనౌన్స్మెంట్తో చైతూ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. సినిమా టైటిల్ ఎలా ఉంటుందో, చైతూ లుక్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది.
రేపు మొదటి చూపు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ అంతా చూస్తోంది.














.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!