

ఆర్. మాధవన్ తన పేరెంటింగ్ విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు వేదాంత్ ను చిన్నప్పటి నుంచే పెద్దవాడిలా చూసానని, నాలుగేళ్ల వయసు నుంచే అతనితో ఓపెన్‌గా మాట్లాడేవాడినని తెలిపారు. కుముదం మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ వ్యక్తిగత భద్రత, గౌరవం, బాధ్యత వంటి అంశాలపై పిల్లలతో నిజాయితీగా మాట్లాడటం చాలా అవసరమని చెప్పారు. పిల్లలతో విశ్వాసం పెంచుకోవడానికి పారదర్శకమైన సంభాషణలు ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లలను గౌరవంగా చూడటం వల్ల వారిలో బాధ్యత పెరుగుతుందని మాధవన్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే సరైన అవగాహన కల్పిస్తే పిల్లలు జీవితాన్ని మరింత పరిపక్వంగా అర్థం చేసుకుంటారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవన్ ఆలోచనలను పలువురు ప్రశంసిస్తూ ప్రోగ్రెసివ్ పేరెంటింగ్‌కు ఉదాహరణగా పేర్కొంటున్నారు. మరోవైపు వేదాంత్ మాధవన్ అంతర్జాతీయ ఈత పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పలు పతకాలు సాధిస్తున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!