

సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమాకు విడుదల తేదీ ఖరారైంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం మే 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దిగంత్, గుల్షన్ దేవయ్యతో పాటు శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబీ సినిమా తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో మరోసారి వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకోగా, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సమంత యాక్షన్ సన్నివేశాల కోసం చేసిన శారీరక సన్నద్ధతను చూపిస్తూ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ లుక్‌ను అందించారు. సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
.jpg&w=3840&q=75)







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!