
సినిమాలు

కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోడుమూరు ఎంపీడీవో రాముడు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అర్హులైన ఓటర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
ముఖ్యంగా సర్వీస్ ఓటర్లతో పాటు, కోడుమూరు మండల పరిధిలో ఓటర్లుగా నమోదై ఉండి MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ విధులకు నియమితులైన ఉద్యోగులు ఈ కేంద్రం ద్వారా ఓటు వేయవచ్చని ఎంపీడీవో వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!