

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కూటమి మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులు, ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, 52వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పున్నపు విష్ణుప్రియకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి నందిమండలం భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!