

హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాల ఫలితాల తర్వాత నిధి అగర్వాల్ కెరీర్‌పై పలు ప్రశ్నలు తలెత్తాయి. వరుస పరాజయాలతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనే ప్రచారం కూడా వినిపించింది. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా సమాచారం సూచిస్తోంది. నిధి ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఖాతాలో మూడు హిందీ చిత్రాలతో పాటు ఓ తమిళ సినిమా కూడా ఉందని సమాచారం. స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ తమిళ ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది. దీంతో ఆమె కెరీర్ ముగిసిందంటూ జరుగుతున్న ప్రచారానికి భిన్నమైన పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఇక తెలుగులోనూ నిధి అగర్వాల్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో మరో 2 తెలుగు సినిమాలు ఉన్నాయని సినీ వర్గాల సమాచారం. వీటిలో ఒకటి యువ హీరో సరసన తెరకెక్కుతుండగా, మరొకటి మహిళా ప్రధాన పాత్రతో రూపొందనున్న ప్రాజెక్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే, రాబోయే 2 ఏళ్లలో ఆమె నటించిన దాదాపు అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఈ లెక్కన నిధి ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరిగా కనిపిస్తున్నారు. అయితే ఆయా చిత్రాల విడుదల తేదీలు, పూర్తి వివరాలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. రాబోయే ప్రాజెక్టులు ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇస్తాయో చూడాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!