

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మరో భారీ చిత్రం తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కలయిక ఇప్పుడు ఆర్‌సీ17 కోసం చేతులు కలపడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ 1న హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. 2027 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కథ, నటీనటుల పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే, సినిమాలో కీలక పాత్ర కోసం ఓ ప్రముఖ తమిళ నటుడిని తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఓ సీనియర్ తమిళ స్టార్‌ను ఎంపిక చేయాలని అనుకున్నప్పటికీ, వాణిజ్యపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే నటీనటుల ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలు ప్రస్తుతానికి పరిశ్రమలో వినిపిస్తున్న ఊహాగానాలుగానే ఉన్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!