

టాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్‌గా పేరు సంపాదించిన రామ్ కొణికి కొత్తగా “కొణికి లక్స్” పేరిట స్కిన్ కేర్ కేంద్రాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని నటి అనన్య నాగళ్ల చేతుల మీదగా నిర్వహించారు. డెర్మటాలజిస్ట్ డా. అలేఖ్య రెడ్డి మార్గదర్శకత్వంలో ఆధునిక టెక్నాలజీ, సర్టిఫైడ్ పరికరాలతో స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ మాట్లాడుతూ, రామ్ కొణికి సుమారు 500 సినిమాలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేశారని తెలిపారు. ఇప్పుడు “కొణికి లక్స్” ద్వారా వైద్యుల పర్యవేక్షణలో క్లినికల్ స్కిన్ కేర్ సేవలు అందించడం విశేషమని చెప్పారు. విదేశాల్లో ఉన్న ఆధునిక టెక్నాలజీతో అన్ని రకాల స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ సెంటర్ అందం, ఆరోగ్యం రెండింటికీ ఉపయోగపడేలా రూపొందించారని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!