

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో జోష్ మీదున్నారు. ‘క’, ‘కె-ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, నటుడిగానే కాకుండా ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. గతంలో ‘తిమ్మరాజు పల్లి టీవీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి, పూర్తిగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, కొత్త ప్రతిభను ప్రోత్సహించినందుకు కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు వచ్చాయి.
తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి ఇదే తరహాలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సమర్పణలో పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్, క ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఓ కొత్త సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందని, ఇందులోనూ పూర్తిగా కొత్తవారికే అవకాశాలు కల్పించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!