

రాజమౌళి–మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆయన పాత్ర ప్రతినాయకుడిగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, సినిమాకు క్లైమాక్స్ అత్యంత కీలకంగా ఉండబోతుందని సమాచారం. కథలోని భావోద్వేగాలు, సాహస అంశాలు, భారీ దృశ్యాలు అన్నీ క్లైమాక్స్‌లో పరాకాష్టకు చేరేలా రాజమౌళి రూపొందిస్తున్నారట.
ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుండగా, మహేష్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను రూపొందించారు. దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!