

బాలీవుడ్ నటి కియారా అద్వానీ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇదిలా ఉంటే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన తమిళ చిత్రం ‘ఎల్ ఐ కే’లో హీరోయిన్‌గా తొలుత కియారా అద్వానీని సంప్రదించినట్లు గతంలో దర్శకుడు వెల్లడించారు. అయితే ఆమె ఆ పాత్రను అంగీకరించలేదు. తాజాగా విగ్నేష్ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.
‘టాక్సిక్’ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విగ్నేష్ శివన్ మాట్లాడుతూ, కియారా ‘ఎల్ ఐ కే’లో నటించకపోవడమే ఆమెకు మంచిదైందని సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తన సినిమాపైనే తాను చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎల్ ఐ కే’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కియారా ఆ సినిమా చేయకపోవడం అదృష్టమేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కియారా ఎలా స్పందిస్తారో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!