

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మొదట్లో కథ ఓ అందమైన ప్రేమకథలా కనిపించినా, ఆ తర్వాత కథానాయకుల మధ్య తలెత్తే విభేదాలు, ఊహించని మలుపులు ఆసక్తిని పెంచుతున్నాయి. నేటి తరం ప్రేమ సంబంధాల్లో కనిపించే అనుబంధం, గొడవలు, భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
వాసుకి వైభవ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చింది. అలాగే సహజమైన సంభాషణలు, యువతకు దగ్గరగా ఉండే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రేమ, వినోదం, భావోద్వేగాలు, అనుకోని మలుపులతో ‘రోమాంచకం’ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా యువతను లక్ష్యంగా చేసుకున్న పక్కా వినోదాత్మక చిత్రంగా ఇది కనిపిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ముందే ట్రైలర్‌కు వస్తున్న స్పందన చిత్రానికి మంచి బజ్ తీసుకొస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!