

భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను 19-9తో చిత్తు చేశాడు. రెండు క్లాసికల్ గేమ్‌ల్లో 9-3తో ఆధిక్యం సాధించిన ప్రజ్ఞానంద, రెండు ర్యాపిడ్ గేమ్‌లను గెలిచి 17-3తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం బ్లిట్జ్ తొలి గేమ్‌లోనూ విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
అప్పటికే ప్రజ్ఞానంద విజయం ఖాయమైనప్పటికీ, టోర్నీ నిబంధనల ప్రకారం మిగిలిన మూడు ర్యాపిడ్ గేమ్‌లను కూడా ఆడాడు. వాటిలో కీమర్ విజయం సాధించాడు. మరో సెమీఫైనల్లో అమెరికాకు చెందిన ఫాబియానో కరువానా 18-12తో వెస్లీ సోపై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో టైటిల్ పోరులో ప్రజ్ఞానంద, కరువానా తలపడనున్నారు. కీమర్, వెస్లీ సో మూడో స్థానం కోసం పోటీ పడనుండగా, టాప్-3లో నిలిచిన ఆటగాళ్లకు వచ్చే ఏడాది గ్రాండ్ చెస్ టూర్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!