

హీరోయిన్ కీర్తి సురేశ్ తన బరువు తగ్గడం, శరీర మార్పులపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ‘మహానటి’ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ఆమె 9 నెలల్లో సుమారు 10 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. జిమ్, హెచ్ఐఐటీ, కార్డియోతో పాటు డైట్ పాటించడం వల్లే ఈ మార్పు వచ్చిందని చెప్పారు.
తన మార్పుపై వచ్చిన విమర్శలు, సర్జరీ ఆరోపణలు తనను బాధించాయని కీర్తి తెలిపారు. 2020 తర్వాత యోగా ప్రారంభించడంతో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, కార్డియో, కాలిస్థెనిక్స్‌తో బ్యాలెన్స్‌గా వర్కౌట్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తన జీవితంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని కీర్తి తెలిపారు. కానీ ఫిట్‌నెస్‌ను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో నటిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!