

‘కేడీ: ది డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట ఇప్పుడు వివాదానికి గురైంది. ధ్రువ్ సర్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే పూర్తి చేసిన షూటింగ్ తర్వాత సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది. తాజాగా ఇందులో ‘సర్కే చునర్..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పాటలోని సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయని వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. దీనిపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కేంద్రం అన్ని వేదికల్లోనూ పాటను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అధికార వర్గాన్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది.
పాన్ ఇండియా మూవీగా 'కేడీ: ది డెవిల్’ రూపొందింది. ఈ బహుభాషా చిత్రాన్ని ప్రేమ్ తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. రీష్మా కథానాయిక. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ యాక్షన్ హంగామాతో సినిమా తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.





.webp&w=3840&q=75)

.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!