

కాకినాడ జిల్లా పిఠాపురంలోని రథాలపేటలో 18, 19వ వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ, స్వతంత్ర అభ్యర్థులు, వారి ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించి, జనసేన అభ్యర్థి, ఏజెంట్‌కు అనుమతి నిరాకరించారంటూ ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ క్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
జనసేన కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో డీఎస్పీ చివరకు ఎంపీ, ఎమ్మెల్యేలను లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన జనసేన శ్రేణులు 19వ వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. ఎంపీ, ఎమ్మెల్యే, జనసేన నాయకులు పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!