

నటి కళ్యాణిప్రియదర్శన్ తొలిసారి కేన్స్ఫిల్మ్ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరవడానికి సిద్ధమవుతోంది. ఫ్రాన్స్‌లో ఈ నెల 12 నుంచి 23 వరకు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవానికి కళ్యాణి ఈ నెల 14న హాజరుకానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేన్స్ ఎప్పటికీ సినిమాకు గొప్ప వేడుక అని, ఈ ఏడాది అందులో భాగమవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని తెలిపింది.
లోకాచాప్టర్1చంద్ర చిత్రానికి లభించిన ప్రేమ ఈ క్షణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేసిందని కళ్యాణి పేర్కొంది. ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు పొందుతోందని, ముఖ్యంగా కొత్త కథలు, కొత్త స్వరాలకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ అనుభూతిని ఆస్వాదించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రోత్సవంలో పలువురు బాలీవుడ్, ప్రాంతీయ సినీ ప్రముఖులు పాల్గొననుండగా, కళ్యాణి తదుపరి జినీ, మార్షల్ చిత్రాల్లో కనిపించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!