

అందం, ఐశ్వర్యం, ఆనందం, కష్టం, పోటీ అన్నీ కలగలిపిన రంగమే సినిమా పరిశ్రమ. ఇక్కడ ప్రతిభతో పాటు అదృష్టం కూడా కీలకం. ఈ నేపథ్యంలో నటీమణి కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలో ఉన్న వివక్షపై తన స్వరాన్ని వినిపించారు. ‘లక్ష్మీకల్యాణం’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె, అగ్ర కథానాయికగా ఎదిగారు. పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తిరిగి నటనలోకి వచ్చి బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం వచ్చే నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది.
అదేవిధంగా కమల్ హాసన్‌తో కలిసి నటించిన ఇండియన్ 3 కూడా విడుదల కోసం ఎదురుచూస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ ఆడ, మగ మధ్య పారితోషికంలో వివక్ష ఇంకా కొనసాగుతుందని తెలిపారు. పరిశ్రమ కార్పొరేట్‌గా మారుతున్నా ఈ సమస్య తగ్గలేదని అన్నారు. దక్షిణాది సినిమా పరిశ్రమపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అక్కడ తాను మరింత సౌకర్యంగా, అవకాశాలతో ఉంటానని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!