
జనరల్

సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నిరసన ర్యాలీలో న్యూస్18 ఇండియా విలేకరితో వాగ్వాదానికి దిగారు. ఓటర్ల జాబితా సవరణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు విపక్ష ఎంపీలు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంతో సమానమనే అర్థం వచ్చేలా ఉన్న నిరసన ప్లకార్డుపై విలేకరి జయా బచ్చన్‌ను ప్రశ్నించారు. దీంతో ఆమె విలేకరి మైక్రోఫోన్‌ను పక్కకు నెట్టి, ప్రశ్నను వక్రీకరించవద్దని అన్నారు. తాను అడిగిన విషయాన్ని విలేకరి మరోలా మలిచారని జయా బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ప్లకార్డుపై ఉన్న విషయాన్నే నేరుగా అడిగానని, ప్రశ్నను వక్రీకరించలేదని విలేకరి స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!