

దసరా సీజన్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. వాయిదా ప్రచారాలను పక్కనపెట్టి రెండు చిత్రాల బృందాలు తమ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ పనులు తక్కువగా ఉండటంతో అక్టోబర్ మొదటి వారంలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అనంతరం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనుంది. ‘జైలర్ 2’కు సీక్వెల్ క్రేజ్, అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా ఉండగా, ‘రణబాలి’కి విజయ్ దేవరకొండ గెటప్, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం ప్రత్యేక బలంగా నిలుస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!