

స్టార్ హీరోల కుమారులు సునాయాసంగా తెరమీద అడుగుపెడుతుంటే, వారి కుమార్తెలు మాత్రం కెమెరాకు దూరంగా ఉంటారు. శృతి హాసన్ వంటి ఒకరిద్దరు మాత్రమే ఈ ధోరణికి మినహాయింపు. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ ఘట్టమనేని సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని వినిపిస్తోంది. ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కొంత వెనక్కి వెళ్తే ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. 90వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ తన కూతురు మంజులని హీరోయిన్గా పరిచయం చేయాలని భావించారు. ఆమెకూ ఆసక్తి ఉండడంతో ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పట్లో బాలకృష్ణ సరసన ఆమెను తీసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. అయితే కృష్ణ అభిమానులు ఆ నిర్ణయానికి వ్యతిరేకించారు. గ్లామర్ ఫీల్డ్కి అమ్మాయిని దూరంగా ఉంచాలని కోరడంతో కృష్ణ వారి అభిప్రాయాన్ని గౌరవించారు. ఆ తర్వాత మంజుల కొన్ని సినిమాలు చేసి, దర్శకురాలిగా ప్రయత్నించి, పోకిరి చిత్రంతో నిర్మాతగా మంచి విజయం సాధించారు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా అనేక సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు.
ఇప్పుడు జాన్వీ సినీ రంగంలోకి అడుగుపెడుతుందంటే, మంజుల నెరవేర్చుకోలేని కల ఇప్పుడు కూతురి రూపంలో నెరవేరబోతోందన్న మాట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కాబట్టి అభిమానులు వ్యతిరేకించే అవకాశం తక్కువే. ఇదే సమయంలో రమేష్ బాబు కూతురు భారతి కూడా ఇండస్ట్రీలోకి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇంకో నాలుగైదేళ్లలో మహేష్ బాబు కూతురు సితార కూడా తెరమీద కనిపించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, సుధీర్ బాబు తర్వాత ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ, చరిత్, దర్శన్, గౌతమ్ లాంటి వారు టాలీవుడ్‌కి సిద్ధమవుతున్నారు.










కామెంట్స్ (2)
Support always to new talent
All the best to Jahnavi