

టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న కొత్త నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్, తమ మొదటి చిత్రమైన రామ్ చరణ్ పెద్ది తోనే భారీ హంగామా సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ఐదు నెలల ముందే విడుదలైన ఫస్ట్ సాంగ్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఆకట్టుకునే ట్యూన్, అందమైన లొకేషన్లు, నూతన ప్రెజెంటేషన్‌తో ఆ పాట సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. మొదటి ప్రయత్నంలోనే ఇంత ప్రభావం చూపడం వృద్ధి సినిమాస్ ప్లానింగ్‌కి నిదర్శనం.
అసలైన విశేషం ఏమిటంటే, మొత్తం పాటను రియల్ లొకేషన్లలో షూట్ చేశారు, దీనివల్ల ప్రతి ఫ్రేమ్‌లో సహజమైన అందం ప్రతిబింబించింది. సాంకేతిక నైపుణ్యం, కృషి, విజన్‌తో టీమ్ అందరినీ ఆకట్టుకుంది. పెద్ది తో మంచి బజ్ క్రియేట్ చేసిన వృద్ధి సినిమాస్, ఇప్పటికే బాలకృష్ణ హీరోగా #NBK111 ప్రాజెక్ట్‌ను హింట్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. కొత్త ప్రొడక్షన్ హౌస్‌గా వారు టాలీవుడ్‌కు కొత్త ప్రమాణాలు సెట్ చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!