
జనరల్

ఎన్నికల కమిషనర్ల నియామకం, తొలగింపు ప్రక్రియలో పారదర్శకతతో పాటు సమానమైన రాజ్యాంగ రక్షణ కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 324(5) కింద ఉన్న నిబంధనలను సవాల్ చేస్తూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఉన్న తొలగింపు రక్షణ ఇతర ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తించేలా చూడాలని పిటిషనర్ కోరారు. కమిషనర్ల తొలగింపు ప్రక్రియలో వివక్షకు తావు లేకుండా సమానమైన నిబంధనలు ఉండాలని వాదించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తమ వివరణను సమర్పించాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!