

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఉత్తరాదిలో రామ్ చరణ్‌కు పెరిగిన క్రేజ్‌ను ఈ సినిమాతో పూర్తిగా ఉపయోగించుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో నార్త్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ముంబై, ఢిల్లీ, లక్నో వంటి నగరాల్లో భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ తరహాలో బలమైన ప్రమోషన్స్‌తో ‘పెద్ది’ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!