
టెక్నాలజీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదలపై ఫిల్మ్ నగర్లో బలమైన బజ్ వినిపిస్తోంది. తొలుత మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 2026కి వాయిదా వేయాలని చిత్రబృందం ఆలోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
సినిమా నాణ్యత, భారీ స్థాయి విజన్ దృష్ట్యా ఎలాంటి తొందరపాటు వద్దని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ బజ్ నిజమైతే, రామ్ చరణ్ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా ‘పెద్ది’ నిలవనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అధికారిక స్పష్టతపైనే ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!