

నటి మీనాక్షీ చౌదరి తన జీవితం, కెరీర్, నటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మహిళలకు జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, తన జీవితాన్ని అమ్మతో పాటు టీచర్స్ చాలా ప్రభావితం చేశారని చెప్పారు. హీరోయిన్లకు ఇప్పుడు బలమైన పాత్రలు లభిస్తుండటం సంతోషంగా ఉందని, తానూ అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నానని అన్నారు. పోటీ గురించి ఆలోచించనని, క్రమశిక్షణతో కష్టపడటమే తన లక్ష్యమని తెలిపారు. స్కూల్, కాలేజ్, మిస్ ఇండియా పోటీల వరకు ప్రతిచోటా తాను పోటీని ఎదుర్కొన్నానని చెప్పారు.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా ఈ నెల 14 న విడుదల కానుంది. మారి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 2024 సంక్రాంతికి 'గుంటూరు కారం', గత ఏడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చానని, ఇప్పుడు ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వస్తున్నానని మీనాక్షీ చెప్పారు. ఈ సినిమాలో సంపన్న కుటుంబానికి చెందిన చారులత పాత్రలో నటించానని తెలిపారు. నవీన్‌తో కలిసి పనిచేయడం సినిమా నేర్చుకునే పాఠశాలలా అనిపించిందన్నారు.
ఇండస్ట్రీలో శాశ్వతంగా సెటిల్ అవ్వడం అనేది లేదని, కొత్త నటీనటులు వస్తూనే ఉంటారని, అందుకే ప్రతి రోజు పోరాటమేనని మీనాక్షీ అన్నారు. గుంటూరు కారం, లక్కీ భాస్కర్ తర్వాత ఇప్పుడు సితార బ్యానర్లో మరో సినిమా చేస్తున్నానని తెలిపారు. నటిగా తన తొలి వెబ్ సిరీస్ ఔట్ ఆఫ్ లవ్ అని, షూటింగ్ మొదటి రోజే ఇబ్బందిగా అనిపించి ‘యాక్టింగ్ వదిలేద్దాం’ అని మేనేజర్‌కు చెప్పానని వెల్లడించారు. కాంట్రాక్ట్ కారణంగా కొనసాగించానని, ఆ తర్వాత నటిగా మెరుగుపడ్డానని అన్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ బాధించాయని, పుస్తకాలు రాయడం ఇష్టమని, ప్రస్తుతం నాగచైతన్యతో వృషకర్మ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!