

ఎల్. బీ. శ్రీరామ్ తెలుగు తెరపై రచయితగా, నటుడిగా తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రతిభాశాలి. ఆయన శరీర భాష, సంభాషణ చెప్పే తీరు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన వృత్తి ప్రయాణం గురించి పలు విషయాలు వెల్లడించారు. రచయితగా ఉన్న తనను నటుడిగా నిలబెట్టింది ఈవీవీ సత్యనారాయణ అని చెప్పారు. రచయితగా తన వేగం చూసి కుటుంబ సభ్యులే భయపడిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
దాదాపు 500 సినిమాల్లో నటించినప్పటికీ, ప్రస్తుతం తెరపై తక్కువగా కనిపిస్తున్నానని తెలిపారు. నటుడు నిరంతరం కనిపిస్తేనే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని, అందుకే ఇప్పుడు చిన్న సినిమాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దర్శకుడిగా, నిర్మాతగా తనదైన మార్గంలో ప్రయాణిస్తున్నానని తెలిపారు. ఒకే విధమైన సర్వసాధారణ పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదని, డబ్బు కోసం నచ్చని పనులు చేయనని స్పష్టం చేశారు. “నేను డబ్బు కోసం వేషాలు వేసే మనిషిని కాదు, కళాకారుడిని” అని చెప్పిన ఆయన, విభిన్నమైన పాత్రలు చేయాలనే ఆశతో తనకు నచ్చిన దారిలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!