
గాసిప్స్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం “పెద్ది” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన మొదటి పాట మ్యూజిక్ ఛార్ట్స్‌లో దూసుకెళ్తూ మంచి హైప్ క్రియేట్ చేసింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రస్తుతం భారీ సెట్లో రూపొందుతున్న యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్ధమవుతోంది.
ఈ గ్రాండ్ సెట్లో రామ్ చరణ్‌పై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్‌ని బాలీవుడ్ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ప్రత్యేక సర్ప్రైజ్గా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!