
గాసిప్స్
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డు పొందిన విషయంపై అపార హర్షం వ్యక్తం చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతాల ఫలితంగా వచ్చిన గౌరవమని భావిస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మీడియా మిత్రులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అనుకోవడం లేదు; ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకులకూ దక్కిన గౌరవం. కళలను గౌరవించి, నన్ను ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 48 ఏళ్లుగా నా ప్రతి పాత్ర, ప్రతి ప్రయత్నానికి ఇచ్చిన మీ ప్రేమే నన్ను ఇంత స్థాయికి తీసుకువచ్చింది."










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!