
సినిమాలు

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల ఆలోచనా విధానం వేగంగా మారుతోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు హీరోల స్టార్‌డమ్‌ను ఆధారంగా చేసుకుని సినిమాలను ఎంచుకునే ప్రేక్షకులు.. ఇప్పుడు దర్శకుడి బ్రాండ్, కథ, మేకింగ్ స్టైల్‌కు కూడా పెద్దపీట వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం హీరోను చూసి కాకుండా.. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాలను ప్రత్యేక ఆసక్తితో ఎదురుచూస్తున్నారని రానా అన్నారు. దర్శకుడి విజన్, కంటెంట్, మేకింగ్‌పై ప్రేక్షకుల్లో పెరుగుతున్న నమ్మకం.. భారతీయ సినీ పరిశ్రమలో మారుతున్న ట్రెండ్‌కు నిదర్శనమని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!