

‘ది ఛేజర్’, ‘ది వెయిలింగ్’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాల దర్శకుడు నా హాంగ్-జిన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘హోప్’ భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కొరియన్ భాషల్లో దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హ్వాంగ్ జంగ్-మిన్, జో ఇన్-సంగ్, హోయాన్‌తో పాటు టేలర్ రస్సెల్, మైఖేల్ ఫాస్‌బెండర్, అలిసియా వికాండర్ కీలక పాత్రల్లో నటించారు.
సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో వింత జీవి కనిపించిందనే వార్తతో కథ మొదలవుతుంది. భయం, మనుగడ, మానవ స్వభావం వంటి అంశాల చుట్టూ సాగే ఈ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయి నటీనటులు, విజువల్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని భారతదేశంలో స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేయనుంది. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న కొరియన్ సినిమాను భారతీయ ప్రేక్షకులు భారీ తెరపై ఆస్వాదించే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!