

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా గరిష్ఠ స్థాయిల్లో కొనసాగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. బుధవారం ఉదయం ట్రెండింగ్ ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కు చేరింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,220 మేర తగ్గడం గమనార్హం.
ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,900 తగ్గి రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, దేశీయ డిమాండ్‌లో ఒడిదుడుకుల ప్రభావంతోనే ధరల్లో ఈ భారీ తగ్గుదల నమోదైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నగరం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని, పేర్కొన్న ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుందని బులియన్ నిపుణులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!