

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ప్రజాదరణ పొందిన నాయకుడని కొనియాడిన మోదీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రజా సేవలో మరింతగా కొనసాగాలని, పవన్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్.. ప్రధాని చూపుతున్న అభిమానం, ప్రోత్సాహం ఏపీ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేయాలనే ఉత్సాహాన్ని తనలో నింపుతున్నాయని తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి అమలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పవన్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇక పవన్‌ను తనకు దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్.. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!