

ఏఏ23 చిత్రం నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను సినీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని సమాచారం. మైత్రీ సంస్థ ప్రత్యేకంగా కేటాయించిన కార్యాలయంలో చిత్రానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారని సమాచారం. సినిమా నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై ఆయన బృందంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రసార హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంతో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో చిత్రీకరణకు అనువైన ప్రాంతాల ఎంపిక కోసం ప్రత్యేక బృందం దేశంలోని పలు ప్రాంతాల్లో పరిశీలన నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏఏ23 ఆగిపోయిందనే ప్రచారానికి భిన్నంగా, ప్రాజెక్ట్ వెనుకపటు పనులు మాత్రం కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!