

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభమై వారం రోజులు కూడా పూర్తికాకముందే హౌస్‌లో వరుస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సీజన్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా, వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. షో ప్రారంభమైన వెంటనే కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించి గేమ్స్ నిర్వహిస్తున్నారు. టాస్కుల్లో ఓడిన వారిని హై రిస్క్ జోన్లోకి పంపిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కామనర్ కంటెస్టెంట్ ఆర్జే చరణ్ ఇప్పటికే మిడ్ వీక్‌లో హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
తాజాగా మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ వార్త ఆసక్తిని పెంచుతోంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం కామనర్స్ నుంచి అమన్ మసూద్, సెలబ్రిటీల నుంచి సుధీర్, చైత్ర రాయ్ హై రిస్క్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చైత్ర రాయ్‌కు తక్కువ సపోర్ట్ లభించడంతో ఆమెను హౌస్మేట్స్ నిర్ణయంతో ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయిన ఆర్జే చరణ్, చైత్ర రాయ్‌లకు రీఎంట్రీ అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరి మధ్య పోటీ నిర్వహించి, ఒకరిని తిరిగి హౌస్‌లోకి పంపే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే బిగ్‌బాస్ తెలుగు 10లో మొదటి వారం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!