

సూపర్ హీరో తేజ సజ్జ నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ చిత్రం జూన్ 25న 3D వెర్షన్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా నిర్వహించిన హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, హనుమాన్ 3D అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయని అన్నారు. తేజ సజ్జ మాట్లాడుతూ 3D ట్రైలర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా ఈ అనుభూతిని థియేటర్లలో ఆస్వాదించాలని కోరారు. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ 3D వెర్షన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. దాదాపు 600 మంది టెక్నీషియన్లు మూడు నెలల పాటు శ్రమించి ఈ వెర్షన్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!